Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో

పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో
గొల్లాలేమో పాటల సందడిలో – గాబ్రీయేలు దూత వచ్చెరో
లోకమంతా రక్షణ వార్తరో – కన్నె మరియ శిశువును కన్నదిరో ౹౹పొద్దుగూకె౹౹
ఆ శిశువేగా నీకు నాకు రక్షకుడు – ఆ యేసేగా మన అందరికి రక్షకుడు ౹౹2౹౹

1. పశువుల పాకలో నిద్దురపోయె – జ్ఞానులకు మిక్కిలి పూజితుడాయె
బంగారు సాంబ్రాణి బోళముతో – సాగిలపడి నమస్కరించిరాయె
సర్వ దూతలు స్తోత్రము పాడిరి – మనసారా గొల్లలు ఆడిరి –
లోకమంతా సంబరమాయె ఈ వేళ ౹౹2౹౹
ఇక జగమంతా చీకటి కానరాదంట – మన బ్రతుకుల్లో సంతోషం నిండెనంట ౹౹2౹౹

2. మదిలోన క్రీస్తుకు నీవు చోటిస్తే – ఆయనకు నీ హృదయం అర్పిస్తే
మనసున ప్రతిపాపం వదిలేస్తే – ప్రభువునకు ఇష్టునిగా నీవుంటే
నీ జీవితాన యేసు పుట్టునులే – నీ బ్రతుకు నూతనమవ్వులే – పరలోక భాగ్యము దొరుకును ఈ వేళ ౹౹2౹౹
ఇక ప్రతి రోజు క్రిస్మస్ పండుగేనంట – నీ బ్రతుకంతా సంతోషం నిండెనంట ౹౹2౹౹

పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో
గొల్లాలేమో పాటల సందడిలో – గాబ్రీయేలు దూత వచ్చెరో
లోకమంతా రక్షణ వార్తరో – కన్నె మరియ శిశువును కన్నదిరో
ఆ శిశువేగా నీకు నాకు రక్షకుడు – ఆ యేసేగా మన అందరికి రక్షకుడు
ఇక జగమంతా చీకటి కానరాదంట – మన బ్రతుకుల్లో సంతోషం నిండెనంట
ఇక ప్రతి రోజు క్రిస్మస్ పండుగేనంట – నీ బ్రతుకంతా సంతోషం నిండెనంట

Leave a Comment