JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం

Lyrics:
ఇదిగో శుభదినం మనమానందించేదం ప్రభువుని జననమూ…
దేవుడే దీనుడై అవతరించె భువిపై మనుజరూపుడై….

జనించెను నేడే రక్షకుడేసు
తల్లి మరియ గర్భమున పశువులా పాకలో
ఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు
దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము
దేవాది దేవుడు మనకొరకే జనియించే ||2||

తూర్పు దేశపు జ్ఞానులకు తార చూపెను మార్గమునే
వెదకి వచ్చి పూజించితిరి బంగారు సాంబ్రాణి బోళముతో
సత్యవాక్యమై వెలిసెనుగా మనకు మార్గమూ చూపుటకూ
దేవదేవుని జననమును కీర్తించి చాటెదమూ
నింగీ నేలా కొనియాడి పాడెనులే

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము
దేవాది దేవుడు మనకొరకే జనియించే ||2||

దేవుడే ఈ లోకమును ఎంతగానో ప్రేమించెనులే
అందుకే మనకొరకై ఏతెంచె ఈభువిపై
విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందుటకూ
ఉచితముగా ఇచ్చెనులే ఆ గొప్ప రక్షణను
నేడే మనకూ అత్యంత శుభదినమూ

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము
దేవాది దేవుడు మనకొరకే జనియించే ||2||

జనించెను నేడే రక్షకుడేసు
తల్లి మరియ గర్భమున పశువులా పాకలో
ఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు
దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము
దేవాది దేవుడు మనకొరకే జనియించే ||2||

Leave a Comment