నే మోయలేను ఈ భారము -Samaadhana Kartha

నే మోయలేను ఈ భారము – నెమ్మది నీయుమా
నే తాళలేను ఈ శోకము – ఓదార్పు నీయుమా
అడుగడుగునా అవరోధమే – ఎందాక భరియించను …..
అన్నినింటిలో అవమానమే – ఎందాక సాహియించను…..

సమాధాన కర్తా … సమాధాన కర్తా..

అన్నీ విడచితి – నిను వెంబడించితి అయినా మారని పరిస్థితులే ….
అన్నీ మరచితి నిన్నే తలచితి అయినా ఆగని నిందలే….
వెంటాడెనే నను నా గతం – ఎటువైపు పరుగెత్తనూ ….
కనిపించదే విశ్రమ స్థానం -ఏ చోట తల వాల్చనూ ….

సమాధాన కర్తా …సమాధాన కర్తా…

అందరికి నీ ప్రేమను పంచితి – అయినా చేసిరి ద్రోహమునే….
అపకారమెవరికి తలపెట్టలేదు-
అయినా లేచిరి శత్రువులే…
నలువైపులా వ్యతిరేకతే …ఎందాక వాదించానూ…
పలురీతులా సంఘర్షనే -ఎందాక పోరాడనూ…

సమాధాన కర్తా …సమాధాన కర్తా…

అన్నీ ఉన్నా నిరుపేదనయ్యా – ఆదరించుము కరుణామయా …
అందరు ఉన్నా ఒంటరినయ్యా – నీదరి చేర్చుకో దయామయా ..
నీ సన్నిధే న్యాయస్థానం.. చూపించుము పరిష్కారం , లేకున్నచో మరుక్షణం తీసేసుకో నా ఈ ప్రాణం…..

సమాధాన కర్తా…సమాధాన కర్తా..

Leave a Comment Cancel Reply

Exit mobile version